- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామాభివృద్ధికి బాటలు : ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
దిశ, బెజ్జంకి : సీఎం కేసీఆర్ దిశ నిర్దేశంలో గ్రామాభివృద్ధికి బీఆర్ఎస్ సర్కార్ బాటలు వేసిందని, గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. బుధవారం బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిల్ల గ్రామంలో నూతనంగా రూ.15 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలకు మహర్దశ వచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల చేతుల్లో నిరాధారణకు, నిర్లక్ష్యానికి గురైన అనేక గ్రామాలు బీఆర్ఎస్ పాలనలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సీతలక్ష్మిభూమయ్య ఎంపీటీసీ మల్లేశం, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, లింగాల లక్ష్మణ్,మేకల శ్రీకాంత్, ఎలా శేఖర్, మోహన్ సుదర్శన్ పాల్గొన్నారు.