సుపరిపాలన దిశగా అధికారులు కృషి చేయాలి : మెదక్ కలెక్టర్

by Aamani |
సుపరిపాలన దిశగా అధికారులు కృషి చేయాలి : మెదక్ కలెక్టర్
X

దిశ, మెదక్ ప్రతినిధి : సుపరిపాలన అందించే దిశగా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నగేష్ వివిధ శాఖల అధికారులతో ఈ ఆఫీస్ విధానం, అధికారుల సమయపాలన,ప్రత్యేక అధికారులు మండలాలలో క్షేత్ర స్థాయి పర్యటనలు సంబంధిత అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల ద్వారా ఫైల్స్ ప్రతిదీ ఈ ఆఫీస్ విధానంలోనే రావాలని మాన్యువల్ ఫైల్స్ చూడడం జరగదని చెప్పారు, ఈ ఆఫీస్ విధానాన్ని పగడ్బంధీగా అమలు జరగాలని సూచించారు. ఈ ఆఫీస్ విధానం అనేది ఒక సమర్థవంతమైన పాలనకు దిక్సూచిగా పని చేస్తుందని తెలిపారు. ఈ ఆఫీసులో ఫైల్స్ పంపినప్పుడు అధికారుల దగ్గర ఎన్ని రోజులు పెండింగ్ ఉన్నాయో అనేది స్పష్టంగా తెలుస్తుందని అందువల్ల కలెక్టర్ తో సహా ప్రతి ఆఫీసర్ పై జవాబుదారితనం పెరుగుతుందని తెలిపారు.

అధికారులు సిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. ప్రత్యేక అధికారులు మండలాల్లో క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పర్యటించాలన్నారు. సామాజిక కార్యక్రమాల్లో, సామాజిక రుగ్మతలు నియంత్రించడంలో అధికారులు పాల్గొనాలన్నారు. అధికారులందరూ తుచ తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించలాన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, జడ్పీసీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, ఇతర శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed