ఆగని మట్టి దందా..అసైన్డ్ భూములను లక్ష్యంగా మట్టి తవ్వకాలు..

by Aamani |
ఆగని మట్టి దందా..అసైన్డ్ భూములను లక్ష్యంగా  మట్టి తవ్వకాలు..
X

దిశ,హత్నూర : అసైన్ భూములను లక్ష్యంగా చేసుకుని కొందరు అర్ధరాత్రి విచ్చలవిడిగా అక్రమంగా మట్టిని తవ్వేస్తున్నారు. హత్నూర మండల పరిధిలో మొరం మట్టి తవ్వకాలు అసైన్ చేసిన భూముల్లో అనుమతి లేకుండా ఇష్టానుసారంగా యంత్రాలతో తవ్వేస్తున్నారు. మొరం మట్టి, మట్టి, తవ్వకాలకు ఎక్కడ అడ్డు అదుపు లేకుండా పోతుంది ,మండల పరిధిలోని దేవులపల్లి శివారులో గల గ్రామాలలో అసైన్డ్ భూముల ను లక్ష్యంగా చేసుకొని మట్టి తవ్వకాలు జరగడం సర్వ సాధారణంగా మారింది. గ్రామాల్లో అడ్డు అదుపు లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. రెడ్డి ఖానాపూర్, నస్తీపూర్ గ్రామాల్లో ఈ మట్టి దందాను కొనసాగించారు. సెలవు రోజుల్లో రాత్రి పగలు తేడా లేకుండా అక్రమార్కులు రెచ్చిపోతూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, లారీ టిప్పర్ల ద్వారా యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు.

అదే విధంగా గుట్టు చప్పుడు కాకుండా రాత్రి 11 గంటల నుండి నాలుగు గంటల వరకు మట్టిని తవ్వకాలు జరుపుతున్నారు, చెరువులు, కుంటలు, ముఖ్యంగా ప్రభుత్వ భూముల్లో, ఎక్స్‌కవేటరర్లతో మట్టిని ఇష్టానుసారంగా తోడేస్తూ మట్టి మాఫియా సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ కొనుగోలు చేసిన భూముల్లో చదును చేసుకోవడం కోసం,అమాయక ప్రజల నుంచి అసైన్ భూముల నుండి ఈ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజురోజుకు మొరం,మట్టి ,అవసరాలు పెరుగుతుండడంతో అక్రమార్కులు దాని విలువలు సైతం పెంచేశారు, ఒక ట్రాక్టర్ మొరం రూ.800 వందల నుంచి 900 వందల వరకు ,టిప్పర్ కి వచ్చి రూ. 7 వేల నుంచి 8 వేల వరకు తీసుకుంటున్నారు.


Next Story

Most Viewed