- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీ ఆర్. కృష్ణయ్య
దిశ, ఝరాసంగం: రాజ్యసభ సభ్యులు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కిష్టయ్య, ఝరాసంగం మండల కేంద్రంలో గల వివిధ హాస్టలను ఆకస్మంగా తనిఖీ చేశారు. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం బీసీ బాలుర వసతిగృహం, కస్తూర్భా గాంధీ విద్యాలయం, మోడల్ స్కూల్, మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలను కృష్ణయ్య పరిశీలించారు. విద్యా వ్యవస్థ పనితీరును ఉపాధ్యాయులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఉన్నతమైన చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు. కస్తూర్బా గాంధీ, మహాత్మ జ్యోతి బాపుపూలే గురుకులలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని పాఠశాల వార్డెన్లకు సూచించారు. ఆయన వెంట బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, పాఠశాల చందు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.