నిమ్జ్ రోడ్డుకు మోక్షం.. పనులు ప్రారంభం..

by Sumithra |
నిమ్జ్ రోడ్డుకు మోక్షం.. పనులు ప్రారంభం..
X

దిశ, ఝరాసంగం : జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్) ప్రాంతానికి రోడ్డు నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఝరాసంగం, న్యాల్ కాల్ మండలం 17 గ్రామాలలో సుమారుగా 12,635 ఎకరాల భూమి సేకరించి 2 లక్షల 50 వేల మందికి ప్రత్యక్షంగా 5 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పన లక్ష్యంగా జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి 2013లో ఏర్పాటైన విషయం తెలిసిందే.

(నిమ్జ్) ప్రాంతానికి ప్రత్యేక రహదారి నిర్మాణం కోసం జహీరాబాద్ మండలం హుగ్గెల్లి 65వ జాతీయ రహదారి నుండి ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ గ్రామ శివారు వరకు సుమారుగా 9 కిలోమీటర్ల మేర వంద అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రంజోల్, కృష్ణాపూర్, మాచునూర్, బర్దిపుర్ గ్రామ శివారులో హద్దులు ఏర్పాటు చేసి ఎర్రజెండాలను పెట్టారు. మాచూనురు గ్రామ శివారులో మట్టి పనులు, భూమి చదును చేసే పనులు జోరుగా కొనసాగుతున్నాయి. రోడ్డు నిర్మాణం కోసం రైతుల నుండి సుమారుగా 67 ఎకరాల భూమిని సేకరించారు. రైతులకు ఇప్పటికే పరిహారం చెల్లించారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం భూములకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed