సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మానుకోవాలి.. మాజీ మంత్రి హరీష్ రావు

by Sumithra |
సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మానుకోవాలి.. మాజీ మంత్రి హరీష్ రావు
X

దిశ, నర్సాపూర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మానుకోవాలని ముఖ్యమంత్రి బూతులకు ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం ఆయన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డితో కలిసి స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాట్లాడారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్‌ పై చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని విమర్శించారు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి మంత్రులు, ముఖ్యమంత్రి గారి మాటల్లో తిరుగుతున్నారని ఆరోపించారు.

మూసి దురావస్థకు కారణం కాంగ్రెస్, తెలుగుదేశం పాలనని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. మూసి నది సమస్యల పై పాదయాత్రకు సిద్ధమని తెలిపారు. మూసి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపు ఎక్కువ వస్తుందని అన్నారు. కేటీఆర్‌ పై కక్ష సాధింపుతోనే ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ప్రజాబలంతోనే కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొంటామని తెలిపారు. సమాజంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి ప్రతాపరెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సత్యం గౌడ్, వెంకట్రామిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed