- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నారాయణఖేడ్‌లో భారీ అగ్ని ప్రమాదం… బూడిదైన 9 కార్లు
దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని కారు గుత్తి రూట్‌లో కాకతీయ స్కూల్ ముందు కార్ గ్యారేజ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి.. నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని కాకతీయ స్కూల్ ఎదురుగా ఉన్న మంగళ్ కార్ మెకానిక్ షెడ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. రిపేర్ కోసం వచ్చిన కారులో ఉన్న సిలిండర్ హఠాత్తుగా పేలడంతో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున చెలరేగాయి. మంటలు ఒక్క కారు నుంచి మరో కార్‌కు అంటుకున్నాయి. గ్యారేజిలో సిలిండర్ బుడ్డిలు ఉండడంతో బాంబులు పేలినట్లు పేలడంతో వాటి శబ్దానికి రోడ్డుపై వెళ్తున్న కొందరికి ప్రమాదం జరిగింది. చుట్టుపక్కల ఉన్న దుకాణా దారులు, వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనలతో పరుగులు తీశారు.
ఈ సందర్భంగా నారాయణఖేడ్ పట్టణంలో కార్ గ్యారేజ్ మెకానిక్ మోయిస్ ఖాన్ హొమ్ని కారులో గ్యాస్ నింపుతున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. గ్యారేజీలో సుమారు 9 కార్లు ఉన్నాయి. ఒక కొత్త కారు డిజైర్, కాలి బూడిద అయ్యా. సుమారు 30 నుంచి 40 లక్షల ఆస్థి నష్టం సంభవించింది. కొద్దిగా ఆలస్యంగా ఫైర్ ఇంజన్ రావడంతో పూర్తిగా కార్లు ధ్వంసం అయ్యాయి. నారాయణఖేడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న డీసీసీ కార్యదర్శి పట్లోల్ల చంద్రశేఖర్ రెడ్డి తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని జరిగిన నష్టం, ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.