ప్రజావాణిలో పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

by samatah |
ప్రజావాణిలో పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
X

దిశ సిద్దిపేట ప్రతినిధి : ప్రజావాణిలో వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సిద్దిపేట కలెక్టరేట్ లో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట కలెక్టరేట్ నిర్మాణం కోసం దుద్దెడ, రాంపల్లి శివారులోని సర్వేనెంబర్ 663,143 రైతుల నుండి భూమిని ప్రభుత్వం సేకరించింది. రైతులకు అప్పటి కలెక్టర్ వెంకట్రాంరెడ్డి భూమి కోల్పోయిన వారి కుటుంబానికి ఉద్యోగం, 200 గజాల ప్లాటు, బోరుబావులకు పండ్ల తోటలకు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దీంతో విసుగుచెంది పిల్లి అశ్వద్ధామ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. ఈ మేరకు అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed