- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైభవంగా సుందరకాండ మహాయజ్ఞం
by Shiva |
X
దిశ, ఝరాసంగం: ఝరాసంగం మండల పరిధిలోని ఇస్లాంపూర్ గ్రామంలో వెలసిన వీర హనుమాన్ దేవాలయంలో సోమవారం భజన మండలి ఆధ్వర్యంలో సుందరకాండ మహాయజ్ఞం చేపట్టారు. గురుపూజతో మొదలై గణపతి పూజ, పుణ్యాహ వచనం, రుత్విక్ వరణం, మంటపారాధన, అఖండ దీపారాధన అనంతరం యాగశాల ప్రవేశం అత్యంత భక్తిశ్రద్ధలతో వేద మంత్రోచ్ఛారణలు, సన్నాయి మేళాల నడుమ కార్యక్రమాలు కొనసాగాయి.
సుందరకాండ యజ్ఞం హవనాదులు మధ్య సుందరకాండ యజ్ఞ పూర్ణాహుతి, మహా మంగళహారతి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహాయజ్ఞం మరో రెండు రోజుల పాటు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో చూడముచ్చటగా అలంకరించారు. వివిధ రకాల పువ్వులతో మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. జిల్లాలో ప్రథమంగా చేపట్టిన సుందరకాండ మహా యజ్ఞం ఎంతో ప్రత్యేకమని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story