విధి నిర్వహణలో అలసత్వం ఏమాత్రం తగదు : పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత

by Shiva |
విధి నిర్వహణలో అలసత్వం ఏమాత్రం తగదు : పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత
X

అంకిత భావంతో పనిచేసే వారికి రివార్డులిస్తాం

సైబర్ నేరలపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలి

దిశ, అక్కన్నపేట : విధి నిర్వహణలో అలసత్వం ఏమాత్రం తగదని పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. మంగళవారం ఆమె అక్కన్నపేట పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ లో ఉన్న పలు రికార్డులను తనిఖీ చేశారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పనితీరును పరిశీలించారు. కేసులు ఏవిధంగా నమోదవుతున్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

గత మూడేళ్ల నుంచి నమోదవుతున్న కేసుల గురించి కంపారిటివ్ స్టేట్ మెంట్ ను పరిశీలించి, అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సీడీ ఫైల్స్, పెండింగ్ ట్రయల్స్ లో ఉన్న సీడీ ఫైల్స్, గ్రేవ్ కేసుల్లో ఉన్న సీడీ ఫైళ్లను పరిశీలించారు. అదేవిధంగా పోలీస్ అధికారులు, సిబ్బందితో ఇంట్రాక్టివ్ సెషన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సిబ్బంది యొక్క సమస్యలు అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో అధికారులు, సిబ్బంది పోటీ పడి అంకిత భావంతో విధులు నిర్వహించాలన్నారు.

అలాంటి వాళ్లకు ప్రతి నెలా రివార్డులు అందజేస్తామని తెలిపారు. బార్డర్ పోలీస్ స్టేషన్ కావడం వల్ల నిత్యం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు. ఫంక్షనల్ వర్టికల్ విధానంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క వివరాలు, వారు నిర్వహిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తుకు రిసిప్ట్ ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యను సావధానంగా విని పరిష్కరించాలని సూచించారు.

రౌడీలు, కేడీలు, సస్పెక్ట్స్ మరియు సంఘ విద్రోహ శక్తులపై నిరంతరం నిఘా ఉంచి, వారి కదలికలపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలన్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ అధికారులు పాత నేరస్తులను తనిఖీ చేయాలన్నారు. విధి నిర్వహణలో రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని సూచించారు. ప్రజల రక్షణ గురించి ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు. వీపీవో వారంలో రెండు మూడు సార్లు సంబంధిత గ్రామాలను సందర్శించి ప్రజలకు ఉన్న సమస్యలపై ఆరా తీయాలన్నారు.

సైబర్ నేరాల గురించి గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సీసీటీఎన్ఎస్ (క్రైమ్ మరియు క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ సిస్టం)తో ప్రతి దరఖాస్తు, యఫ్.ఐ.అర్ ను, సీడీఎఫ్, పార్ట్-1, పార్ట్-2 రిమాండ్ సీడీ, ఛార్జ్ షీట్, కోర్టు డిస్పోజల్ ఆన్ లైన్లో ప్రతిరోజూ విధిగా ఎంట్రీ చేయలని ఆదేశించారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేసి క్రైం రేటును తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసీపీ సతీష్, సిఐ కిరణ్, అక్కన్నపేట ఎస్ఐ వివేక్, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed