- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
కుంటను తలపిస్తున్న కాలనీలు..పట్టించుకోని ప్రజాప్రతినిధులు
దిశ, నర్సాపూర్ : నర్సాపూర్ పట్టణంలోని 9వ వార్డు శ్రీ వెంకటేశ్వర కాలనీలో వర్షానికి నిలిచిన నీటితో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి పారిన నీరంతా దిగువ ప్రాంతానికి వెళ్లకుండా కొందరు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయడంతో నీరంతా నిలిచిపోయి కుంటను తలపిస్తుంది. ఇళ్ల మధ్యలో పెద్ద ఎత్తున నీరు చేరడంతో కొందరి ఇళ్ళకు వెళ్లడానికి పడరాని పాట్లు పడుతున్నారు. చేసేదేమీ లేక నీటిలో నుంచి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. వర్షాల వల్ల కాలనీలో విద్యుత్ సమస్య తలెత్తడంతో విద్యుత్ సిబ్బంది నీళ్ల లోపల నుంచి స్తంభాన్ని ఎక్కి పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
గత పది రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో సమస్య మరింత పెరిగిందని, వర్షం నీరు నిలవడం వల్ల దోమలు ఈగలు ఎక్కువై రోగాల బారిన పడే అవకాశం ఉందని కాలనీవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులకు తమ కాలనీ కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకొస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ పాలకవర్గం, అధికారులు చర్యలు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.