- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర భేటీ

దిశ, ములుగు : బడా బడా నేతలు ఇప్పటికే పార్టీని వీడిపోవడం.. ఎమ్మెల్యేలు సైతం ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్రమత్తం అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలతో మర్కుక్ మండలంలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం పార్టీ వీడుతున్న నాయకులను బుజ్జగింపులు, ముందు ముందు పార్టీలో చేయబోయే కార్యచరణ పై చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్‌కు చేరుకొని కేసు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం పాల్గొన్నారు.
ఈ సమావేశానికి మాజీ సీఎం కేసీఆర్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావ్, వేముల ప్రశాంత్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపా. వివేకానంద, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేర్ లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కే గాంధీ, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ విటల్, షేర్ సుభాష్ రెడ్డిలు లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా పార్టీని వీడుతారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఆయన నియంత్రణ చర్యలకు దిగారు.