జన్మజ దుఃఖ వినాశక లింగం… కేతకీకి పోటెత్తిన భక్తులు

by Naresh |
జన్మజ దుఃఖ వినాశక లింగం… కేతకీకి పోటెత్తిన భక్తులు
X

దిశ, ఝరాసంగం: జిల్లావ్యాప్తంగా శైవక్షేత్రాలు ఆధ్యాత్మికత శోభ ను సంతరించుకున్నాయి. తెల్లవారు జాము నుంచే శివుడికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. అష్ట తీర్థాల సంగమం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయంలో మహాశివరాత్రి నవాహ్నిక బ్రహ్మో కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయానికి భారీగా పోటెత్తారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 5 గంటల సమయం పట్టింది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ, మేల్కొల్పు సేవ, మహా రుద్రాభిషేకం, మహా మంగళ హారతి నిర్వహించిన అనంతరం రాత్రి 2: 00 నుంచి భక్తులకు ప్రవేశాన్ని దర్శనానికి అనుమతించారు.

కాగా తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, భక్తులు భారీగా తరలివచ్చారు. ముందుగా భక్తులు అమృత గుండంలో స్నానాలు ఆచరించి స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. కేతకి పరిసరాలు ఝరాసంగం దేవస్థానం "ఓం నమశ్శివాయ" పంచాక్షరి మంత్రాలతో మారు మోగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాక రాత్రి 2: 00 నుంచి లక్ష మంది వరకు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేశారు.

కేతకిలో ప్రముఖుల పూజలు

ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, జహీరాబాద్ సివిల్ కోర్టు జడ్జి అనూష, సంగారెడ్డి అడిషనల్ ఎస్పీ సంజీవ రావు, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ మఠం బిక్షపతి, వై నరోత్తం తదితరులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అధికారులు సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed