- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు

X
190 కేజీల గంజాయి స్వాధీనం.. ఆరుగురు అరెస్ట్
దిశ పటాన్ చెరు: అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు రామచంద్రపురం పోలీసులు. ఈ నెలలో రెండోసారి పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం నమ్మదగిన సమాచారం మేరకు రామచంద్ర పురం పోలీసులు, రాజేంద్ర నగర్ ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా ఇక్రిశాట్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ, తూర్పు గోదావరి ఏజెన్సీ నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర లోని నాసిక్ కు రెండు కార్లలో తరలిస్తున్న రూ.40 లక్షల విలువైన 190 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ కేస్ లో మహారాష్ట్ర కు చెందిన ఆరుగురుని అరెస్ట్ చేయడంతో పాటు రెండు కార్లు, 8 మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Next Story