- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
100కు డయల్ చేస్తే.. ఇసుక మాఫియాకు సమాచారం అందించారు
దిశ, నిజాం పేట: ఇసుక దందా అక్రమంగా సాగుతుందని 100కు సమాచారం ఇస్తే... ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇంటికి వెళ్ళి ఇసుక మాఫియా గ్యాంగ్ దాడి చేశారు. ఈ సంఘటన చిన్న శంకరంపేట మండలం జంగరాయిలో చోటుచేసుకుంది. బాధితుడు ఎర్రోళ్ల హరీష్ రామాయంపేట సీఐకి ఎస్ఐ పై గురువారం ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని జంగరాయి గ్రామ శివారులో వాగు నుంచి రాత్రి సమయంలో ప్రతిరోజు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అనుమతి లేకుండా సాగుతున్న ఇసుక అక్రమ దందా పై జంగరాయి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల హరీష్ పోలీసుల దృష్టికి తెచ్చేందుకు 100కు ఫోన్ చేసి ఇసుకను అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని తెలిపారు. 100 డయల్ చేసిన వెంటనే ఇసుక దందాను పెట్టుకోవాల్సిన చిన్న శంకరంపేట ఎస్సై ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోలేదని, పైగా 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన ఎర్రోళ్ల హరీష్ పేరు ఇసుక మాఫియాకు తెలిపాడని తెలిపారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలు పోలీసులు ఇసుక మాఫియాకు చెప్పడంతో వారంతా ఎర్రోళ్ల హరీష్, అతని తండ్రి పైన రాళ్లతో కట్టెలతో దాడి తీవ్రంగా గాయపరిచారని బాధితుడు సీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇసుక మాఫియాకు కొమ్ము కాస్తూ ఫిర్యాదు చేసిన వారి సమాచారం ఇచ్చిన ఎస్ఐతో పాటు ఇసుక మాఫియా పై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు.