మొబైల్ లో లింక్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ : రూ.3లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు

by Shiva |
మొబైల్ లో లింక్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ : రూ.3లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: రోజురోజుకూ సైబర్ కేటుగాళ్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో అదివారం సైబర్ కేటుగాళ్ల చేతిలో ఐదుగురు బాధితులు మోసపోయారు. గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిట్‌ కాయిన్, ట్రేడింగ్‌లో పెట్టుబడి పేరిట ఓ సైబర్ నేరగాడు సందేశం పంపాడు. అది నమ్మిన బాదితుడు రూ.1.45లక్షలు అతడికి చెల్లించాడు. తిరిగి అతడికి ఫోన్ చేయగా అతని నుంచి ఎలాంటి సమాచారం లేదు. అదేవిధంగా చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పార్ట్‌టైమ్ జాబ్‌ను చూసి అక్కడ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకున్నాడు.

బాధితుడుకి టాస్క్ కోసం డబ్బు అవసరమని, టాస్క్ అయిపోయిన తర్వాత కమిషన్ తో పాటు డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చని కేటుగాళ్లు నమ్మపలికారు. ఈ ఘటనలో బాధితుడు రూ.86 వేలు కోల్పోయాడు. సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రిప్టో ట్రేడ్ కోసం మొదట రూ.5వేలు పంపాడు. అనంతరం అతడు సెక్యూరిటీ కోసం రూ.15 వేలు చెల్లించమని, ఇలా డబ్బులు కావాలని అడుగడంతో బాధితుడు పోలీసును అశ్రయించాడు. ఈ ఘటనలో బాధితుడు రూ.53వేలు కోల్పోయాడు.

ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగానికి ఎంపికైనట్లు నమ్మబలికి బాధితుడి నుండి సైబర్ నేరగాడు రూ.6 వేలు కాజేశారు. తొగుట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు కి లింక్‌ పంపి అందులో డబ్బు జమ చేస్తే కమిషన్ వస్తుందని చెప్పగా బాధితుడు లింక్ ద్వారా రూ.18వేల వరకు జమ చేశాడు. తరువాత లింక్ బ్లాక్ కావడంతో బాధితుడ ఆ డబ్బు కోల్పోయాడు. అపరిచితు నుంచి ఫోన్లు, ఈ మెయిల్స్‌లో వచ్చే ఫిషింగ్ లింక్స్‌ను క్లిక్ చేయోద్దని సీపీ శ్వేత ప్రజలకు సూచించారు. బాధితులు ఈ విధంగా డబ్బు కోల్పోతే.. వెంటనే 1930 కి కాల్ చేయాలని సూచించారు.

Advertisement

Next Story