- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Hanumantha Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్యే వద్దంటే కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అంటుర్రు
దిశ, సిద్దిపేట ప్రతినిధి : బీఆర్ఎస్ ఎమ్మెల్యే వద్దంటే కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అంటుర్రు.. కొందరు కాంగ్రెస్ నాయకులకు రాత్రి ఫోన్ చేసి చెప్పాలని బతిమిలాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. సిద్దిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకునే కల్చర్ కాంగ్రెస్ పార్టీది, రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పాం.. చేసి చూపిస్తున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను తొందరలోనే అమలు చేస్తామన్నారు. ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోక పోవడం వల్లే కొంత మంది రైతులకు రుణ మాఫీ కాలేదన్నారు. అర్హులైన రైతుల రుణాలు మాఫీ అయ్యేలా చూడాలని కార్యకర్తలకు సూచించారు. ఆగస్టు 15లోగా
రెండు లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. యూపీఏ చైర్ పర్సన్ గా సోనియా గాంధీ ఉన్నప్పుడు రూ.70వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేసినట్లు గుర్తు చేశారు. కేసీఆర్ దళిత సీఎం అని చెప్పి దళితులను మోసం చేస్తే, కాంగ్రెస్ పార్టీ భట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎం చేసి వారి ఆత్మ గౌరవాన్ని పెంచింది అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన 7 నెలల్లోనే ఉద్యోగాల భర్తీ మొదలు పెట్టినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పుడే ఆ పార్టీ పని కథమైందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ వద్దన్నా ప్రాజెక్టుల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో
చేపట్టిన ప్రాజెక్టులు నేలలోకి కూరుకుపోతున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో ప్రగతి భవన్, సెక్రటేరియట్ కు ఎవరిని రానివ్వ లేదన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో అందరికీ అనుమతి ఉందన్నారు. రైతులు ప్రతిపక్షాల మోసపూరిత మాటలను నమ్మ వద్దు అన్నారు. కేంద్రంలో ప్రధాని మోడీ కూడా రెండు కోట్ల ఉద్యోగాల పేరుతో జనాలను మోసం చేశారన్నారు. 25 కోట్ల మందికి సహాయం చేశానని చెప్పుకుంటున్న ప్రధాని మోడీ ఎవరికి చేశారో బయటపెట్టాలన్నారు. ఆంధ్రాలో విశాఖ ఉక్కు కోసం మేం పోరాడుతాం.. స్పెషల్ స్టేటస్ కోసం కూడా పోరాడుతామన్నారు. పాలక పక్షంలో అనవసర ఆరోపణలు మాని బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పిదాలను తెలుసుకోవాలని ఆ పార్టీ నేతలకు హితవు పలికారు.