ఇచ్చిన హామీలు అమలు చేయాలి

by Sridhar Babu |
ఇచ్చిన హామీలు అమలు చేయాలి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆశ వర్కర్లు వినూత్న నిరసన తెలిపారు. కోమటి చెరువు వద్ద బీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. నిరసనకు మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు, బీఆర్ఎస్ నాయకుడు పాల సాయిరాం, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పిండి అరవింద్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఆశ వర్కర్లకు నెలనెలా రూ. 18 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఆశ వర్కర్ కు ఆరోగ్య బీమా అమలు చేయాలన్నారు. హామీలను అమలు చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ, కార్మిక సంఘాల నాయకులు నర్సింహులు, శోభన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed