అలవికాని హామీలతో ప్రభుత్వం ఆగం...!?

by Naresh |
అలవికాని హామీలతో ప్రభుత్వం ఆగం...!?
X

దిశ, మెదక్ ప్రతినిధి: అధికారం కోసం సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికార కాంగ్రెస్ ఆగం అవుతుందని, ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఊరుకోమని మెదక్ బీ‌ఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి హెచ్చరించారు. ఎల్‌ఆర్‌ఆర్ విధానం పై మెదక్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎల్‌ఆర్‌ఎస్ కు ఫీజు వసూల్ చేస్తే అడ్డు చెప్పారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ ఇస్తామని అధికారంలో ఉన్న మంత్రులు వాగ్దానం చేశారని అన్నారు. కానీ ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌కు గడువులోగా చెల్లించాలని ఆర్డర్‌లు జారీ చేసిందని ఆగ్రహించారు. పేదల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తే తాము ఉరుకొనమి అన్నారు. ప్రజల కోసం ఉద్యమాలు తమకు కొత్త కాదని, ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామని చెప్పారు.

ఇది ఆరంభం మాత్రమేనని, పోరాటాలకు అంతం లేదని అన్నారు. అధికారంలో ఉన్న లేకున్నా తమకు హై కమాండ్ ప్రజలే అన్నారు. అధికారంలోకి రామన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ సాధ్యం కానీ 420 హామీలు ఇచ్చిందని, అందులో ఆరు గ్యారంటీలు కూడా అమలు చేయడం లేదని అన్నారు. ప్రతి స్కీమ్‌లో కొర్రీలు పెట్టీ పేదలకు ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తున్నారని, దానికి ప్రజలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అభివృద్ధి పై ప్రశ్నిస్తే కౌన్సిలర్‌లను బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. రీల్స్ లో కాదు రియల్ అభివృద్ధిని చూపాలని సలహా ఇచ్చారు. మెదక్‌కు కేసీఆర్ ఇచ్చిన రూ. 50 కోట్లు, రామాయంపేట కు వచ్చిన రూ. 25 కోట్లు, ఇతర నిధులు మళ్ళీ పోతున్న రీల్స్ నేతలకు తెలియడం లేదా అని ప్రశ్నించారు.

పది వేల ఓట్లతో ఓడిపోయాను అని చెప్పే ఎమ్మెల్యేకు మీ తండ్రి ఎన్ని వేలతో ఓడిపోయాడు అనే విషయం కూడా గుర్తుండాలని హితవు చెప్పారు. మెదక్‌ను కేసీఆర్ మాత్రమే అభివృద్ధి చేశారని, ప్రత్యేకంగా నిధులు ఇచ్చి రైలు తేవడంతో పాటు జిల్లా కలెక్టరేట్, మెడికల్ కళాశాల సైతం మంజూరు చేశారని చెప్పారు. మెడికల్ కళాశాల ఉందా లేదా తెలియని పరిస్థితి మెదక్‌లో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. బయటపెడితే భయపడేది లేదని, ప్రజల సమస్యల పరిష్కారం తో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ఎన్ని రోజులైనా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ ధర్నాలో మెదక్ నియోజక ఇంఛార్జి కంటా రెడ్డి, లావణ్య రెడ్డి, చంద్రపాల్, అంకిరెడ్డి కృష్ణ రెడ్డి, సొములు, బట్టి ఉదయ్, ఎంపీపీ యమున జయరామ్ రెడ్డి, విశ్వం, బొద్దుగుల కృష్ణ, జయరాజ్, రాజు, శ్రీధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed