- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
by Shiva |

X
దిశ, అమీన్ పూర్: గ్రామాల పరిధిలో నూతనంగా ఏర్పడుతున్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి అన్నారు. కృష్ణారెడ్డి పేట పరిధిలోని కళ్యాణ్ ఎస్టేట్స్ కాలనీలో రూ.70లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత మురుగు నీటి కాలువల నిర్మాణ పనులకు సోమవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ దేవానందం, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, సర్పంచ్ కృష్ణ, వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Next Story