- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
దిశ, పటాన్ చెరు : నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణాలతో పాటు పురాతన ఆలయాలను జీర్ణోధారణ చేసేందుకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం కర్దనూరు గ్రామంలో అక్క మహంకాళి బీరప్ప స్వామి, కామారతి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ఆలయ నిర్మాణానికి 6 లక్షల రూపాయల విరాళం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. యాదగిరిగుట్ట, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి తదితర దేవస్థానాలను ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహాయ సహకారాలతో గుడి నిర్మాణానికి 20 లక్షల రూపాయలు నిధులు సేకరించడం జరిగిందని గ్రామ ఉపసర్పంచ్ వడ్డే కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.