- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భూ క్రమబద్ధీకరణకు గడువు పొడగింపు : కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
by Shiva |

X
దిశ, సిద్దిపేట ప్రతినిధి : జిల్లాలో జీవో నెం.58, 59 ద్వారా పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు మే 2 నుంచి మే 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ కొరకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో మీసేవా ద్వారా మే 31 వరకు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 58, 59 ప్రకారం ప్రభుత్వ ఆక్రమిత భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదల ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించి, హక్కులను కల్పించాలని ప్రభుత్వం మరో నెలరోజుల గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
Next Story