ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుంటా..

by Naresh |
ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుంటా..
X

దిశ, బెజ్జంకి: మండల కేంద్రంలో స్థానిక సత్య అర్జున్ ఫంక్షన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన బెజ్జంకి మండలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తను తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని, మీ కృషి వల్లనే నా గెలుపు సాధ్యమైందని, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను ప్రజలలోకి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త సఫలీకృతుడయ్యాడని, దాని ఫలితమే నా పదవి అని పేర్కొన్నాడు. నేను ఒక కుమ్మరి మట్టి లాంటి వాడినని , ప్రతి కార్యకర్త నన్ను ఏ విధంగా మలుచుకుంటే ఆ విధంగా కార్యకర్తకు ఉపయోగపడతానని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి గ్రామీణ స్థాయి కార్యకర్తలు ప్రజా భవన్‌కు వచ్చి నన్ను కలవవచ్చు అని సమస్యలు వివరించవచ్చు అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కొత్త పాత అనే లేకుండా సమన్వయంతో కార్యకర్తలు సహకరించుకుంటూ రానున్న పార్లమెంట్ ఎలక్షన్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేయాలని కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని విషయాన్ని ప్రజలకు వివరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.

అదే విధంగా రాష్ట్రాన్ని పరిపాలించిన బీ ఆర్ఎస్, కేంద్రాన్ని పరిపాలిస్తున్న బీజేపీ గాని ప్రజలకు చేసింది ఏమీ లేదని, ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని, రాముడు అందరికీ దేవుడే అని, రామరాజ్యం పరిపాలన అందిస్తానన్న మోడీ పరిపాలనలో దళితులకు, మైనార్టీలకు, స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందని వారిపై అనేక మైనటువంటి దాడులు, అత్యాచారాలు వారి పరిపాలనలో మనం చూసామని అన్నారు. రానున్న ఎన్నికల్లో రెండు పార్టీల యొక్క 10 సంవత్సరాల పరిపాలన ప్రజల్లో ప్రచారం చేయాలని, లౌకిక రాజ్య స్థాపన, అణగారిన వర్గాలకు న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని ప్రజలకు భరోసా కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కిన రత్నాకర్ రెడ్డి, ఒగ్గు దామోదర్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు పులి కృష్ణ, గూడెల్లి శ్రీకాంత్, కనగండ్ల జ్యోతి, శనగొండ శ్రావణ్ మహంకాళి ప్రవీణ్ , రావుల నరసయ్య, పోచయ్య, వడ్లూరు బేగంపేట ఎంపీటీసీ పోతిరెడ్డి స్రవంతి మధుసూదన్ రెడ్డి, క చెప్యాల శ్రీనివాస్ , మానాల రవి, మెట్ట నాగరాజు, జెల్ల ప్రభాకర్ యాదవ్, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, మహంకాళి బాబు, బొనగం రాజేశం, రాసూరి మల్లికార్జున్, ధోనే వెంకటేశ్వరరావు, పులి సంతోష్ , పులి రమేష్ ,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed