ప్రారంభానికి ముందే ప్రమాదంలో కరెంటు స్తంభాలు

by Aamani |
ప్రారంభానికి ముందే ప్రమాదంలో  కరెంటు స్తంభాలు
X

దిశ, చేర్యాల: చేర్యాల పట్టణ కేంద్రంలో నేషనల్ హైవే 365/B రోడ్డు విస్తరణలో భాగంగా ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న పాత కరెంటు స్థంభాలను కొత్తగా నిర్మించిన డ్రైనేజీ కాలువ పక్కన పాతాల్సి ఉంటుంది. అయితే కొత్త స్థంభాల ఏర్పాటు విషయంలో సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.స్తంభాలను ఒక క్రమపద్ధతిలో కాకుండా ఇష్టానుసారంగా పాతడం, స్తంభాల తీసిన గోతిని పూడ్చే సమయంలో నాణ్యత పాటించకపోవడంతో వాటికి వైర్లు అమర్చి కరెంటు సరఫరాలో ఇవ్వకముందే స్థంభాల నేలకొరగడం తో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed