ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

by Shiva |
ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
X

దిశ, మెదక్ టౌన్ : ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ పట్టణం లో బాలికల పాఠశాలలో డైనింగ్ హల్ నిర్మాణానికి మన బస్తీ.. మన బడిలో భాగంగా రూ.98 లక్షలు మంజూరు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొసం మన బస్తీ.. మన బడి పథకంలో నిధులు మంజూరు చేస్తుందన్నారు.

అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో రాధకిషన్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్ అకిరెడ్డి కృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు బిమారి కిషోర్, శ్రీనివాస్, వంజరి రాజు, లక్ష్మీనారాయణ గౌడ్, ఎంఈవో నీలకంఠ, హెచ్ఎం రేఖ, ఉమర్, భాను, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed