- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాగునీటికి తండ్లాట
దిశ, కోహెడ : “ప్రతీ రోజు నీటి కోసం పనులు వదులుకొని తిరుగుతున్నాం. మిషన్ భగీరథ నీరు రావడం లేదు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇన్నేళ్లలో ఎప్పుడు ఇలాంటి గోస చూడలేదంటూ” బస్వాపూర్ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. మంచినీటి ట్యాంకు నిరుపయోగంగా మారింది. మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. శనివారం కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో గత రెండు నెలల నుంచి తాగునీటి కట కటతో తీవ్ర ఇబ్బంది ఏర్పడగా సహనం కోల్పోయిన మహిళలు గ్రామ పంచాయతీని ముట్టడించారు. తమ నీటి సమస్య పట్టించుకోని అధికారులను నిలదీయగా అందుబాటులో నోడల్ అధికారులు లేరని, ఇంచార్జి గ్రామ సెక్రటరీ మహిళలను సముదాయించి త్వరలో జిల్లా ఉన్నతాధికారులకు సమస్యలు తెలియజేసి నీటి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. తమ గ్రామానికి పూర్తి స్థాయి గ్రామ సెక్రటరీని నియమించి గ్రామంలో సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులు అందుబాటులో ఉండాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు.