- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాగునీటి సమస్య తలెత్తోద్దు… చెట్లు ఎండి పోవద్దు
దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఎండాకాలంలో జిల్లాలో మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం సకాలంలో త్రాగునీరు అందే విధంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా తాగునీటి కొరత గల ప్రాంతాలు, వాటిని అధిగమించడానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… మిషన్ భగీరథ పైన ఈనెల 7 నుంచి 15వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాగునీటి కొరత, పైప్ లైన్ లీకేజీలు, వాటర్ ట్యాంక్ మరమ్మతులు, క్లోరినేషన్ ఆంశాల పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో ప్రత్యేక అధికారులు మిషన్ భగీరథకు సంబంధించి రికార్డులను మెయింటేన్ చేయాలన్నారు.
పీఎం విశ్వకర్మ పథకానికి ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న వారి వెరిఫికేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎన్‌ఆర్ ఈజీఎస్ లో కూలీల కొరత అధికమించాలన్నారు. ఎండాకాలంలో చెట్లు ఎండిపోకుండా సంరక్షించాలన్నారు. ప్రజా పాలన సేవా కేంద్రాల్లో గృహ జ్యోతి, మహలక్ష్మి పథకాలు తలెత్తున్న సమస్యలను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరిమా అగర్వాల్, డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్యా, జడ్పీసీ ఇఓ రమేష్, డీపీఓ దేవకీ దేవి, మిషన్ భగీరథ ఎస్ ఇ శ్రీనివాస్ చారి, తదితరులు పాల్గొన్నారు.