- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్ : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పర్యవేక్షించిన జిల్లా డీఎం
దిశ,అల్లాదుర్గం : రైతులకు వరి కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పెడితే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా డిఎం హరికృష్ణ అన్నారు. శుక్రవారం బస్తాకు ఐదు కిలోల తరుగు పేరిట రైతుల నుంచి అదనంగా వడ్లను దోపిడీ చేస్తున్నారని 161 జాతీయ రహదారిపై రైతన్నలు ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని దిశ దినపత్రిక ప్రచురించింది. దీనికి జిల్లా డిఎం స్పందించి శనివారం అల్లాదుర్గం మండలంలోని సీతానగర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దని ఆదేశించారు.
అటు రైతులతో ఇటు రైస్ మిల్లర్ యజమానులతో చర్చించి రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని ఆయన సూచించారు. కొనుగోలు కేంద్రాలను సజావుగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలపెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలియజేశారు. ఆయన వెంట ఆర్ ఐ శరణప్ప ఏఈఓ నవీన్ కుమార్ సీసీ హబీబ్ వట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల లక్ష్మి శేషారెడ్డి శేషారెడ్డి , కాంగ్రెస్ పార్టీ నాయకులు, హన్మయ, సాయిలు, సాయిలు, బేతాయ,కిష్టయ్య, దుర్గయ్య నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.