- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యతోనే.. అభివృద్ధి సాధ్యం: కలెక్టర్ శరత్
దిశ, సంగారెడ్డి: విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని, చైతన్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. బుధవారం బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, వివిధ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నటరాజ్ థియేటర్ పక్కన కల్వకుంట రోడ్డులో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకుపోతేనే మహనీయులకు నిజమైన నివాళి ఆయన అన్నారు.
జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి మాట్లాడుతూ మహనీయుల చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. సమాజంలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు అందాలన్నారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా, మంత్రిగా అనేక విజయాలు సాధించారని, ఆయన ఆశయాలను అందరూ ముందుకు తీసుకుని వెళ్లాలని కోరారు.
అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, టీఎస్ఎస్ కళాకారుల కళాజాత కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఇన్ చార్జి అధికారి జగదీష్, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.