Komuravelli Mallikarjuna Swamy : కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి..

by Sumithra |
Komuravelli Mallikarjuna Swamy : కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి..
X

దిశ, కొమురవెల్లి : ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. శ్రావణమాసం కావడంతో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు. ఆలయానికి వచ్చిన భక్తులు మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా పట్నం, అభిషేకం, అర్చన, నిత్య కళ్యాణం, బోనం, తిరుగుడు కోడె, కేశ కండన, గంగిరేగు చెట్టుకు ముడుపులు తదితర మొక్కలను కుటుంబ సమేతంగా చెల్లించుకున్నారు. అనంతరం కొండపైన రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందిచారు.



Next Story

Most Viewed