భవిష్యత్తులో కూడా కేసీఆరే సీఎం : ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

by Shiva |   ( Updated:2023-08-10 10:35:16.0  )
భవిష్యత్తులో కూడా కేసీఆరే సీఎం : ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
X

దిశ, మెదక్ ప్రతినిధి : రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న కేసీఆర్ భవిష్యత్తులో కూడా సీఎంగా కొనసాగుతారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. కలెక్టరెట్ లో బీసీ లబ్ధిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రమేష్ ల చేతుల మీదుగా గురువారం అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 14 ఏళ్ల పోరాట ఫలితంగా వచ్చిన తెలంగాణలో దశల వారీగా అభివృద్ధి కొనసాగుతోందన్నారు. రైతు సంక్షేమం కోసం మిషన్ కాకతీయ పథకం తీసుకువచ్చి చేరువులు బాగు చేశామని తెలిపారు.

సాగుకు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్ అందించడంతో పాటు రైతు బంధు, రైతు భీమా పథకాలు తీసుకువచ్చారని వివరించారు. ఉపాధి కల్పన కోసం దళిత బంధు పథకం కింద దళితులకు రూ.10 లక్షలు అందిస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. మైనారిటీ, ఇతర వర్గాలతో పాటు కుల వృత్తులనే నమ్ముకొని కింది స్థాయి ప్రజలు జీవనం సాగిస్తున్న బీసీలకు వృత్తిలో మరింత అభ్యున్నతి సాధన కోసం రూ.లక్ష ఆర్థిక సాయం ప్రభుత్వం అదజేస్తుందిన తెలిపారు.

మొదటి విడతలో గ్రామ, వార్డుల్లో కొంత మందిని ఎంపిక చేశామని, దరఖాస్తు చేసిన వారి అందరి పరిశీలన చేసి ప్రతి నెల 300 మందికి బీసీ ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. గృహలక్ష్మి పథకం సైతం నిరంతరం కోనాగుతుందని, ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు నమ్మవద్దని అన్నారు. గృహ లక్ష్మి పథకం సైతం నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు. ప్రజల సంక్షేమాన్ని ఎప్పుడు పట్టించుకోని గత పాలకులు ప్రభుత్వం అందించే పథకాలపై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని హితవు పలికారు.

అన్ని వర్గాల కోసం కృషి చేస్తున్న కేసీఆర్ భవిష్యత్తులో కూడా సీఎం గానే కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రాపాల్, వైస్ చైర్మన్ మల్లిఖార్జున్ గౌడ్, బీసీ సంక్షేమ అధికారి, ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed