తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ ఎదుగుతోంది: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

by Shiva |
తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ ఎదుగుతోంది: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
X

దిశ, అమీన్ పూర్: సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని, భవిష్యత్తులో దేశ రాజకీయాల్లోనూ కీలకపాత్ర కీలకపాత్ర పోషిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి అమీన్ పూర్ మున్సినిపాలిటీ పరిధిలోని బీరంగూడ మండే మార్కెట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీరంగూడ రజక సంఘం అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో యువకులు, మహిళలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణను నేడు దేశానికి ఆదర్శంగా నిలిపిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో నాయకత్వంలో పటాన్ చెరువు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామన ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు సైతం అభినందించేలా అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రత్యేకంగా రజకుల సంక్షేమానిక ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి, పార్టీ మునిసిపాలిటీ అధ్యక్షుడు బాల్రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed