- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిట్టి దేవేందర్‌రెడ్డిపై BRS హైకమాండ్ సీరియస్.. ఆ ఘటనతో పార్టీకి చెడ్డ పేరని తీవ్ర ఆగ్రహం!
దిశ, సంగారెడ్డి బ్యూరో: క్యాసినో డాన్ చీకోటి ప్రవీణ్‌తో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి దోస్తానాపై బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. క్యాసినో వ్యవహారం దాదాపు 9 నెలల క్రితమే రాష్ట్రంలో సంచలనం సృష్టించగా, ఈడీ విచారణలు కూడా కొనసాగిన విషయం తెలిసిందే. అప్పుడే చిట్టి దేవేందర్ రెడ్డి పేరు బయటకు రావడం ఆయన కూడా ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఆ సమయంలోనే అధికార బీఆర్ఎస్ పార్టీ తీరు, పార్టీ నేతల వ్యవహారంపై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.
దీంతో అప్పుడే సీఎం కేసీఆర్‌తో పాటు జిల్లా ఇన్ చార్జి మంత్రి హరీశ్‌రావు కూడా చీకోటితో చిట్టి దోస్తానా, క్యాసినో వ్యవహారంపై తీవ్ర స్థాయిలో హెచ్చరించినట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది. బాస్ స్థాయిలో హెచ్చరించినప్పటికీ దేవేందర్ రెడ్డి చిట్టి మారలేదని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటేనే పార్టీలో కింది స్థాయి వరకు మంచి మేసేజ్ వెలుతుందని పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్‌లోనే ఆయన వ్యతిరేకులు చర్యలు తీసుకోవాలని అధిష్టానంపై పట్టుబడుతున్నట్లు సమాచారం.
ఉమ్మడి మెదక్ జిల్లా కొండపాకకు చెందిన చిట్టి దేవేందర్ రెడ్డికి చాలా కాలం నుంచి క్యాసినో డాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రచారంలో ఉన్నది. గోవాతో పాటు థాయిలాండ్‌లలో క్యాసినో డాన్‌గా చీకోటి ప్రవీణ్ కుమార్ పేరుగడించారు. ఏపీ, తెలంగాణలో కూడా ఆయన పేరు వినగానే క్యాసినో డాన్ అంటారు. ఇదిలా ఉండగా గత ఏడాది జూలైలో గోవాలో క్యాసినో వ్యవహారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
అదే సమయంలో దేవేందర్ రెడ్డి వ్యవహారం బయటపడిన విషయం కూడా విదితమే. చీకోటి క్యాసినో దందా రెండు తెలుగురాష్ట్రంలో సంచలసం సృష్టించింది. చీకోటితో కలసి చిట్టి దేవేందర్ రెడ్డి విందు వినోదాల్లో పాల్గొన్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో విస్త్రతంగా చక్కర్లు కొట్టాయి. అయితే ఈడీ విచారణకు ఇటు చీకోటి, మరో వైపు చిట్టి దేవేందర్ రెడ్డి హాజరు అయ్యారు. ఏం జరుగిందో ఏందో తెలియదు కానీ ఆ వ్యవహారం అక్కడితో సద్దు మనిగింది.
అప్పుడే హెచ్చరించిన సీఎం కేసీఆర్..?
సరిగ్గా తొమ్మిది నెలల క్రితం క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణతో ఉమ్మడి జిల్లా చిట్టి దేవేందర్ రెడ్డి పేరు బయటపడింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెట్టపేరు వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, జిల్లా మంత్రి హరీశ్‌రావులు దేవేందర్ రెడ్డిని హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పేకాటను నిషేధించి సీఎం కేసీఆర్ మంచి పేరు తెచ్చుకుంటే అదే పార్టీ నేతలు ఇతర దేశాల్లో అవే ఆటలు అడుతూ పార్టీకి చెడ్డపేరు తేస్తే ఊరుకుంటారా..? అని ముఖ్య నాయకులు హెచ్చరించారు. స్వయంగా సీఎం కేసీఆర్, హరీశ్ రావుల సొంత జిల్లా కావడంతో మీడియాలో తప్పుడు సంకేతాలు వెలతాయని పార్టీ అధిష్టానం ఆగ్రహిస్తున్నది. క్యాసినో జోలికి వెళ్లవద్దని, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని గతంలోనే గులాబీ బాస్ గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం.
"చిట్టి"పై చర్యలు ఉంటాయా..?
ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రజా ప్రతినిధి ఇలా క్యాసినో, పేకాట వంటి ఆటలు ఆడుతూ పట్టుబడడాన్ని అధికార టీఆర్ఎస్ తీసుకుంటున్నది. చిన్న తప్పులను కూడా సీరియస్ గా పరిగణిస్తున్న పార్టీ అధిష్టానం చిట్టి విషయంలో ఏలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి అంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చిట్టి వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ లో హాట్ టాఫిక్ గా మారింది.
తప్పు చేసినప్పుడు చర్యలు ఉండాలని అలాంటప్పుడే కింది స్థాయి కార్యకర్తలకు మంచి మేసేజ్ వెలుతుందని, తప్పని సరిగా అతనిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వస్తున్నది. గతంలో సీఎం కేసీఆర్ హెచ్చరించినప్పటికీ ఆయన మాత్రం అదే క్యాసినో, గ్యాంబ్లింగ్ కు పాల్పడడాన్ని పట్టించుకోకపోతే పార్టీపై తీవ్ర వ్యతిరేకత వస్తుందంటున్నారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే పార్టీలని పెద్దలపై అనుమానం వస్తుందంటున్నారు. దేవేందర్ రెడ్డి వ్యవహారంపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోనున్నది అనే అంశం ఇప్పడు ఆసక్తిగా మారింది.