- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం..
దిశ, ఆందోల్ : సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కన్ సాన్ పల్లి వద్ద 161 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణఖేడ్ నుంచి జోగిపేట వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు కన్ సాన్ పల్లి వద్దకు రాగానే అదుపు తప్పి జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ ను స్పీడ్ గా ఢీకొట్టి డివైడర్ పైకి ఎక్కి.. కొంత దూరం డివైడర్ పైనుంచి బస్సు అలాగే దూసుకెళ్ళి ఆగింది. బస్సులో సుమారుగా 50 మందికి పైగా ఉండగా, వీరిలో 20 మంది వరకు గాయాలు అయ్యాయి.
మిగతా వారు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన వారిని జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జోగిపేట ఎస్ ఐ పాండు సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంబదాస్, అనిల్, సుజాత మంజుల ముకుందరావు, లావణ్య, హనుమంతు, శ్యామల, తనుశ్రీ, అంజమ్మ లకు గాయాలు అయినట్లు తెలిపారు. డ్రైవర్ అజాగ్రత్తగా, అతివేగంగా నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.