Additional Collector Chandrasekhar : బీసీ వెల్ఫేర్ హాస్టల్ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్..

by Sumithra |
Additional Collector Chandrasekhar : బీసీ వెల్ఫేర్ హాస్టల్ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్..
X

దిశ, నారాయణఖేడ్ : నారాయణఖేడ్ జూకల్ శివారులో గల మహాత్మ జ్యోతిబాపూలే స్కూల్ హాస్టల్ ని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ తో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలతో పలు విషయాల పై మాట్లాడారు. స్టూడెంట్స్ కు పెడుతున్న భోజనం, మెనూ తదితర అంశాలు ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు.

ఇటీవల ఎమ్మెల్యే సంజీవరెడ్డి మోడల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంక్వయిరీ చేసినట్లు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. స్టూడెంట్స్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏ సమస్య అయినా తమ దృష్టికి తీసుకొస్తే త్వరితగతిన పరిష్కారం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదనపు కలెక్టర్ వెంట నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కర్, కమిషనర్ జగ్జీవన్, కౌన్సిలర్ వివేకానంద, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story