విజయానికి అంగ వైకల్యం అడ్డుకాదు.. అదనపు కలెక్టర్ రాజార్షి షా

by Javid Pasha |   ( Updated:2022-11-23 13:57:05.0  )
విజయానికి అంగ వైకల్యం అడ్డుకాదు.. అదనపు కలెక్టర్ రాజార్షి షా
X

దిశ, సంగారెడ్డి: సాధించాలన్న పట్టుదల ఉంటే అంగ వైకల్యం విజయానికి అడ్డుకాదని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సంగారెడ్డి అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన దివ్యాంగుల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజార్షి షా మాట్లాడుతూ.. దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి క్రీడా పోటీలు దోహదపడతాయన్నారు. సకలాంగులకు తీసిపోనివిధంగా దివ్యాంగులు అన్ని రకాల ఆటల పోటీలలో ఉత్సాహంగా పాల్గొనడాన్ని ఆయన అభినందించారు. జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రథమ విజేతలుగా నిలిచని వాళ్లను హైదరాబాద్ లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. ఇక దివ్యాంగులకు సీనియర్ (17 నుంచి 54 ఏళ్లు), జూనియర్ (10 నుంచి 16 ఏళ్లు) కేటగిరిలో పోటీలు నిర్వహించారు. పరుగు పందెం, షాట్ పుట్, జావలిన్ త్రో, ట్రై సైకిల్ రేసు, క్యారం, చెస్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి పద్మావతి, స్వఛ్చంద సంస్థల ప్రతినిధులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed