- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం నియోజకవర్గంలో కార్యకర్తలు సంతోషంగా లేరు: తూప్రాన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఉద్యమకారులు
దిశ, తూప్రాన్: పట్టణ పరిధిలో బుధవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు సతీష్ చారి అధ్యక్షతన ఓ ఫంక్షన్ హల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, అటవీ శాఖ అభివృద్ధి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ హేమలత, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమిరెడ్డి హాజరయ్యారు, మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు సభకు హాజరైన కొందరు ఉద్యమకారులు మాట్లాడుతూ తూప్రాన్ పరిధలో గూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని అన్నారు. దీంతో పార్టీకి బలం, బలగం కార్యకర్తలేనని.. ఈ పరిణామాలతో కార్యకర్తలు ఏమాత్రం సంతోషంగా లేరని అన్నారు. ప్రతి ఆత్మీయ సమ్మేళనంలో మాజీ చైర్మన్లు పరస్పరం వారు విబేధాల గురించే మాట్లాడుకుంటున్నారని ఆరోపించారు. ఆత్మీయ సమ్మేళనం అనే పేరుతో రాజకీయ విబేధాలు తవ్వుకుంటూ పార్టీకి నష్టం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, ఉద్యమ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.