- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైభవంగా ఏడుపాయల నూతన రథం ఊరేగింపు
by Naresh |
X
దిశ, మెదక్ ప్రతినిధి: ఏడుపాయల వన దుర్గామాత ఆలయంకు నూతనంగా తయారు చేసిన రథంను భారీ ఊరేగింపు తరలించారు. ఏడుపాయల వన దుర్గ మాత ఆలయంకు దాతలు హోటల్ చంద్ర భవన్ యాజమాన్యం నూతన రథం తయారు చేయించారు. మహా శివరాత్రి జాతరలో నూతన రథం ఊరేగింపు చేసేందుకు బుధవారం మెదక్ నుంచి ఏడుపాయల వరకు భారీ స్థాయిలో ర్యాలీగా తీసుకు వెళ్ళారు. చంద్ర భవన్ యాజమాన్యంతో పాటు ఆలయ చైర్మన్ బాలా గౌడ్, ఈవో మోహన్ రెడ్డిలతో పాటు ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేసి రథంను ప్రారంభించారు. స్థానిక రామాలయం, వెంకటేశ్వర ఆలయం వద్ద సైతం ప్రత్యేక పూజలు చేశారు.. డప్పు చప్పుళ్లతో పట్టణంలో దుర్గా మాత నినాదాలతో ఊరేగింపు ఏడుపాయల వరకు ర్యాలీగా తరలించారు. దాతలు రాగి రమేష్, వెంకటేష్, చక్రపాణి, అశోక్ కుటుంబ సభ్యుల తో పాటు ఏడుపాయల పాలక వర్గం, స్థానిక ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో ఊరేగింపులో పాల్గొన్నారు.
Advertisement
Next Story