డైలీ ఇలా చేస్తే చాలు మీరు ఆరోగ్యంగా ఉంటారు: కిరణ్

by Disha daily Web Desk |
డైలీ ఇలా చేస్తే చాలు మీరు ఆరోగ్యంగా ఉంటారు: కిరణ్
X

దిశ, జగదేవపూర్: ప్రతి ఒక్కరూ ఆరోగ్యం ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలని ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్ అన్నారు. సోమవారం జగదేవపూర్ మండల పరిధిలోని మునిగడపలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని యువకులకు 2కే రన్ నిర్వహించారు. ఈ రన్ లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోటీలో ప్రథమ బహుమతి దూల్మిట్ట వినయ్ కి రూ.5 వేలు, ద్వితీయ బహుమతి లక్ష్మారెడ్డికి రూ. 2,500 కిరణ్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాల లక్ష్మి ఐలయ్య, ఉప సర్పంచ్ లావణ్య మల్లేశం, గజ్వేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలకిషన్, పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు శ్రీశైలం ఉన్నారు.

Advertisement

Next Story