Congress: నేడు ట్యాంక్ బండ్‌పై టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా.. ఎందుకంటే?

by Ramesh N |   ( Updated:2025-02-02 07:19:53.0  )
Congress: నేడు ట్యాంక్ బండ్‌పై టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర బడ్జెట్‌ (Union Budget 2025)లో తెలంగాణపై వివక్షకు నిరసనగా నేడు (TPCC) టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగే భారీ ధర్నాను విజయవంతం చేయండి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో నగరంలోని ప్రతి కార్యకర్త పాల్గొనాలని వెల్లడించారు. ఈ మేరకు ఆయన తాజాగా ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలో సాయంత్రం 4 గంటలకు ట్యాంకుబండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే కాంగ్రెస్ పార్టీ ధర్నాలో హైదరాబాద్ (Congress) ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, నగరంలోని ముఖ్య నేతలు, పార్టీ అనుబంధ సంఘాలు, పార్టీ కార్యకర్తలు పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed