Manchu Family: నా ఫ్యామిలీని చంపేందుకు విష్ణు కుట్ర.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
Manchu Family: నా ఫ్యామిలీని చంపేందుకు విష్ణు కుట్ర.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మంచు మోహన్ బాబు ఫ్యామిలీ(Manchu Mohan Babu Family)లో గొడవలు సర్దుమణగడం లేదు. తాజాగా.. ఆదివారం మరోసారి గొడవ పడ్డారు. ఈసారి జనరేటర్ విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌(Pahadi Shareef Police Station)లో మంచు విష్ణు(Manchu Vishnu)పై మనోజ్ ఫిర్యాదు చేశారు. అనంతరం మనోజ్(Manchu Manoj) మీడియాతో మాట్లాడారు. పోలీసులు హెచ్చరించినా నన్ను, నా కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇవాళ నా కుటుంబాన్ని హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. నా తల్లి బర్త్ డేను అడ్డం పెట్టుకొని నా ఇంట్లోకి వచ్చి జనరేటర్‌లో డీజిల్ కలిసిన షుగర్ పోశారు. ఇది చూసిన కోచ్‌ను మంచు విష్ణు బెదిరించారు. ఎవరికీ చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చారు. విద్యుత్‌లో భయంకరమైన హెచ్చుతగ్గులు జరిగాయి’ అని మనోజ్ సంచలన ఆరోపణలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed