- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుప్రీంకోర్టుకు చేరిన మంగపేట వివాదం
దిశ, తెలంగాణ బ్యూరో: ములుగు జిల్లా మంగపేట మండల పరిధిలోని 23 గ్రామాలు రాజ్యంగంలోని పిప్త షెడ్యూలు కిందకు వస్తాయా.. రావా అనే వివాదం 73 సంవత్సరాలుగా న్యాయస్థానాల్లో నలుగుతూ చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ గ్రామాలు షెడ్యూలు ఏరియా (ఏజెన్సీ) పరిధిలోకే వస్తాయని గతంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ తీర్పునివ్వగా దాన్ని సవాలు చేస్తూ గిరిజనేతరులు డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు. చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ జూలైలో విచారించి సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పు సక్రమమేనని పేర్కొని అప్పీల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీన్ని సవాలు చేస్తూ గిరిజనేతరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది.
ఆదివాసీల తరపున సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ.. మంగపేట మండలంలోని 23 గ్రామాలు ఫిఫ్త్ షెడ్యూలు పరిధిలోకే వస్తాయని, హైకోర్టులో అనేక మార్లు జరిగిన విచారణల తర్వత వెలువడిన తీర్పులు కూడా దీన్నే ధృవీకరించాయని గుర్తుచేశారు. ఈ తీర్పుపై స్టే ఇవ్వాల్సిందిగా గిరిజనేతరులు పిటిషన్‌లో పేర్కొన్న అంశాన్ని చిక్కుడు ప్రభాకర్ తప్పుపట్టారు. స్టే ఇవ్వడం వల ఎలాంటి ప్రయోజనం ఉండదని, గతంలో హైకోర్టులోనూ రెండుసార్లు ఆదివాసీలు, గిరిజనులకు అనుకూలంగానే తీర్పులు వెలువడ్డాయని గుర్తుచేశారు. గిరిజనేతరుల తరఫున దాఖలైన పిటిషన్‌లోని రిక్వెస్టుకు అనుగుణంగా స్టే ఇవ్వవద్దని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.
పిటిషనర్ తరఫున లేవనెత్తిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం... తగిన వివరాలను, కౌంటర్ అఫిడవిట్‌లో పొందుపర్చాలని చిక్కుడు ప్రభాకర్‌కు సూచించింది.. తదుపరి విచారణను అక్టోబరు 10వ తేదీకి వాయిదా వేస్తున్నందున అప్పటికల్లా కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని స్పష్టం చేసింది.