కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి చిలిపి చేష్టలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

by GSrikanth |
కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి చిలిపి చేష్టలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మాన‌కొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. న్యూ ఇయర్ సందర్భంగా మాన‌కొండూరు నియోజకవర్గంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరైన ఈ వేడుకలో కేక్ కటింగ్ చేశారు. అనంతరం ఒకరికి ఒకరు కేక్ తినిపించుకుంటూ విష్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సత్యనారాయణ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. మహిళ చెంపపై ఎమ్మెల్యే కేక్ పూశారు. దీంతో అసౌకర్యంగా ఫీల్ అయినట్లు కనిపించారు.

మంత్రిని పక్కకు జరిపి మరీ ఎమ్మెల్యే సత్యానారాయణ మహిళకు కేక్ పూసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళ పట్ల ఎమ్మెల్యే సత్యనారాయణ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే ప్రవర్తనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా.. దీనిపై కాంగ్రెస్ స్పందించింది. బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. సదరు మహిళ ఎమ్మెల్యే బంధువేనని స్పష్టం చేశారు. ప్రజల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు తమ ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed