Bandi Sanjay: మజ్లిస్ పార్టీ విష సర్పం కంటే డేంజర్.. ఓవైసీ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్

by Prasad Jukanti |
Bandi Sanjay: మజ్లిస్ పార్టీ విష సర్పం కంటే డేంజర్.. ఓవైసీ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వక్ఫ్ ఆస్తులను దోచుకున్న బడా చోర్లంతా కలిసి నిన్నటి మీటింగ్ లో పాల్గొని బీజేపీపై విషం చిమ్మారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) విమర్శించారు. మజ్లిస్ నేతలు విష సర్పాల కంటే డేంజర్ అని, ముస్లిం ఓట్లను దండుకుని ముస్లింలను ఆదుకోకుండా వక్ఫ్ ఆస్తులను దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. ఈ ఇవాళ పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న దారుస్సాలంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asuddin Owaisi) నిర్వహించిన బహిరంగ సభపై కౌంటర్ ఇచ్చారు. నిన్న మజ్లిస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభ ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్డ్ కార్యక్రమమని, ఈ మీటింగ్ కు కర్త, కర్మ, క్రియగా అంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనని ఆరోపించారు. ఈ మీటింగ్ కు ఆర్ధిక సాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నార. ముస్లింల పట్ల ప్రేమ నటిస్తూ వక్ఫ్ ఆస్తులను దోచుకుతింటూ ముస్లింలను మురికి కూపాల్లోకి నెట్టేసిన మజ్లిస్ నేతలు అంతకంటే డేంజర్ అని ధ్వజమెత్తారు.

ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా?:

మేం వాస్తవాలు మాట్లాడుతుంటే వక్ఫ్ ఆస్తుల్లో (Waqf Act) హిందువుల జోక్యం చేస్తున్నారంటూ అంటూ అడ్డగోలుగా మాట్లాడతరా? వక్ఫ్ బోర్డు పేరుతో ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. వక్ఫ్ ఆస్తులను కాజేసినా, వక్ఫ్ పేరుతో హిందువుల, క్రిస్టియన్ల, సిక్కుల భూములను, ప్రార్ధనా మందిరాల భూములను ఆక్రమించుకుంటే ఊరుకోవాలా అని నిలదీశారు. హైడ్రాను ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వక్ఫ్ ఆస్తులపై విచారణ జరిపించే దమ్ముందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో 77 వేల ఎకరాల వక్ఫ్ ల్యాండ్స్ ఉంటే... అందులో 80 శాతం భూములు ఈ దొంగలే స్వాధీనం చేసుకుంది నిజం కాదా? ఒవైసీ కుటుంబంతో పాటు మజ్లిస్ నాయకులు, సోకాల్డ్ వక్ఫ్ బోర్డు సభ్యులంతా వక్ఫ్ ఆస్తులను దోచుకుని ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు నిర్మించి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది నిజం కాదా? అన్నారు.

శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?

వక్ఫ్ ఆస్తులపై ఏటా 12 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుంటే ఆ సొమ్మునంతా దిగమింగుతోంది మీరు కాదా? ఒక్క తమిళనాడులోనే 2 వేల కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకుంది మీరు కాదా? అని ప్రశ్నించారు. వక్ఫ్ పేరుతో ఇతర మతస్తుల, ఆలయాల, గురుద్వారాల భూములను కొల్లగొట్టింది ఈ దొంగలే కాదా? స్యాతంత్ర్య సమరయోధుల స్వారక చిహ్నాలను, మందిరాల, గురుద్వారా భూములను కూడా వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటూ ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అంబేద్కర్ ఆలోచనలను, ఆశయాలను సాధించేందుకు నిరంతరం మోడీ కృషి చేస్తున్నారని, అసలు అంబేద్కర్ పేరును ఉచ్చరించే అర్హత కూడా ఒవైసీకి లేదన్నారు. వక్ఫ్ ఆస్తులపై వచ్చే ఆదాయంతో ఒక్క పేద ముస్లిం జీవితానైనా బాగు చేశారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. కనీసం పాతబస్తీలో మురికి కూపాల్లో బతుకుతున్న ముస్లింలకు గజం జాగా అయినా ఇచ్చారా? వక్ఫ్ ఆస్తులపై ఏటా వచ్చే ఆదాయాన్ని వేటికి ఖర్చు చేస్తున్నారో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని నిలదీశారు.

ఇటువంటి పరిస్థితుల్లో జపాన్ టూరా?:

అకాల వర్షాలు, వడగండ్ల వానతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులంతా అల్లాడుతుంటే వాళ్లను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన పేరుతో విదేశాలకు వెళ్లడమేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో పంట దెబ్బతిన్న రైతులకు పరిహారం ఇవ్వలే. ఈ ప్రభుత్వం అదే పంథా కొనసాగిస్తోంది. ఇకనైనా వెంటనే రైతులను ఆదుకోవాలని సీఎం మంత్రులకు ఆదేశాలివ్వాలని కోరుతున్నా.



Next Story