Mahesh Kumar Goud: కేటీఆర్ పగటి కలలు మానుకో.. టీపీసీసీ చీఫ్ కౌంటర్

by Prasad Jukanti |
Mahesh Kumar Goud: కేటీఆర్ పగటి కలలు మానుకో.. టీపీసీసీ చీఫ్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని అన్ని రంగాల్లో కాంగ్రెస్ మార్కు పాలన కనిపిస్తున్నదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ప్రజంతా సంతోషంగా ఉన్నారు కనుకే ప్రభుత్వం పండగ నిర్వహిస్తున్నదన్నారు. ఈ ప్రజాపాలన పండగలో అందరూ పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ 50 వేల ఉద్యోగాలు ఇస్తే ఈ ఏడాది కాలంలోనే మేము 50 వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు. బీఆర్ఎస్ నిర్బంధం పాలన నుంచి ప్రజలు విముక్తి పొందారని గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీలు పెంచామన్నారు. మా ప్రభుత్వం వచ్చాక ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామన్నారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 9న ప్రజాపాలన వారోత్సవాలు, తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని సీఎం కోరారు. మేము కూడా పార్టీ పరంగా కేసీఆర్ కు ఆహ్వానం పలుకుతున్నామన్నారు. కేటీఆర్ (KTR) అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ విగ్రహం, రాజీవ్ గాంధీ విగ్రహాలను వేటి స్థానంలో వాటిని ఉంచుతామని కేటీఆర్ చేసి వ్యాఖ్యలకు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఇంకా పగటి కలలు కంటున్నారని వారి పార్టీ ఇంకెక్కడ అధికారంలోకి వస్తుందని ప్రశ్నించారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాజేసిన మిమ్మల్నీ ఈ రాష్ట్ర ప్రజలు మళ్లీ అధికారంలోకి తెస్తారనే ఎలా అనుకుంటున్నారన్నారు.

మీరు పదేళ్లలో చేసిన దోపిడి ఇంతా అంతా కాదన్నారు. మీరు అధికారంలోకి వస్తే తెలంగాణ తల్లి విగ్రహాన్ని (Telangana Talli statue) ఎందుకు తీస్తారు? మీరు పెడితే తెలంగాణ తల్లి అదే మేము పెడితే కాంగ్రెస్ తల్లి అవుతుందా? మీ లెక్కన మీరు పెట్టింది బీఆర్ఎస్ తల్లిని పెట్టారా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి దృఢ సంకల్పంతో తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రంహ అచ్చ తెలంగాణ సంస్కృతిని, కట్టుబాట్లను ప్రతిబింబించేలా ఉంటుందన్నారు. సామాన్యుడి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్న తరుణంలో తెలంగాణ తల్లి కూడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉంటుందన్నారు. అసలు తెలంగాణ తల్లి విగ్రహం తీసేస్తామనడానికి అసలు మీరెవరన్నారు. అమెరికాలో చదివి వచ్చానని చెబుతున్న కేటీఆర్ కు రాజీవ్ గాంధీ చరిత్ర తెలియదా అన్నారు. ఈ దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణాలు త్యాగం చేస్తే ఈమేరం చేశారని ప్రశ్నించారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టె దొరకలేదని నటించిన హరీశ్ రావు (Harish rao) త్యాగదనుడా? ఉద్యమం తీవ్రంగా సాగుతున్నప్పుడు అమెరికాలో ఉన్న నువ్వు మీ చెల్లి ఈ రాష్ట్రం కోసం ఏం త్యాగం చేశారు. అధికారం రాగానే ఉన్నఫలంగా వచ్చేసి మంత్రులుగా, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా చలామణి అయిన మీరు ఏం త్యాగం చేశారని రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సర్వసంపదను దేశానికి త్యాగం చేసింది గాంధీ కుటుంబం అయితే రాష్ట్ర ప్రజల సంపదను దోచుకున్న కుటుంబం కేసీఆర్ కుటుంబమని విమర్శించారు. భూములు, నిధులు, నీళ్ల పేరుతో రాష్ట్ర సొమ్మును దోచుకున్న మీరు గాంధీకుటుంబం గురించి మాట్లాడితే ప్రజలు అసహించుకోవాలన్నారు.

నిన్న బీఆర్ఎస్ నేతలు అరెస్టు డ్రామాను తెరలేపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు విధించారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ధర్నాచౌక్ ను ఎత్తివేశారని, ప్రతిపక్ష నాయకులకు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేశారన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎవరిని నిర్బంధం, హౌస్ అరెస్టులు లేవన్నారు. మీ రాజకీయ ప్రాభల్యం పెంచుకునేందుకు, అటెన్షన్ డైవర్షన్ కోసం విచ్చలవిడిగా మాట్లాడుతున్నారన్నారు. కౌశిక్ రెడ్డి మాట్లాడే భాష ఏంటన్నారు. ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ (KCR) కౌశిక్ రెడ్డిని మందలించడం లేదని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి (Koushik Reddy) విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకుంటారని ప్రశ్నించారు. చట్టం ఎవరి చుట్టం కాదని శాంతిభద్రతలు తమ చేతుల్లోకి తీసుకుంటాం అని భావిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. పదేళ్లుగా చేసిన దోపిడి ఒక్కొక్కడిగా బయటకు వస్తున్నాయని హరీశ్ రావుపై చీటింగ్ కేసు నమోదైందన్నారు. మీ పదేళ్ల నిరంకుశ పాలన ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ మనుగడ సాధిస్తుందని అనుకోవడం లేదని ఆ పార్టీ నేతలు పగడి కలలు మానుకోండన్నారు.



Next Story

Most Viewed