RSS, BJP నేతలకే అవార్డులు ఇవ్వాలా.. బండి సంజయ్‌పై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్

by Gantepaka Srikanth |
RSS, BJP నేతలకే అవార్డులు ఇవ్వాలా.. బండి సంజయ్‌పై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: పద్మ అవార్డుల(Padma Awards)పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) చేసిన కామెంట్లు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాగాయకుడు గద్దర్(Gaddar) పేరు ప్రస్తావించి.. ఆయన ‘బరాబర్ ఇవ్వం’ అని బండి సంజయ్ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే ఎంపీ చామల కిరణ్ రెడ్డి(MP Chamala Kiran Reddy), అద్దంకి దయాకర్(Addanki Dayakar) వంటి నేతలు స్పందించి విమర్శలు చేశారు. తాజాగా.. బండి కామెంట్లపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..RSS, BJP నేతలకే పద్మ అవార్డులు ఇవ్వాలా? అని ప్రశ్నించారు. కేంద్రహోంశాఖా సహాయ మంత్రిగా ఉండి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం అని అన్నారు.

రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా యుద్ధ నౌకగా గద్దర్ పేరు చిరస్మరణీయమని తెలిపారు. మరోవైపు.. బండి సంజయ్ వ్యాఖ్యల ప్రభావంతో నాంపల్లి బీజేపీ కార్యాలయం(Nampally BJP office) వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కాంగ్రెస్ కార్యకర్తలు బండి దిష్టిబొమ్మ దహనం చేశారు. బండితో పాటు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాంధీభవన్ నుంచి బీజేపీ కార్యాలయం వైపు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగా, పద్మ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి సైతం అసహన వ్యక్తం చేశారు.

గోరటి వెంకన్న, గద్దర్‌, జయధీర్‌ తిరుమలరావు, చుక్కా రామయ్య, అందెశ్రీ వంటి ప్రముఖుల పేర్లు కేంద్రానికి సిఫార్సు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏపీకి 5 అవార్డులు ఇచ్చారని.. తెలంగాణకు నాలుగైనా ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. పద్మ అవార్డుల విషయంలో చూపిన వివక్షపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. అయితే, సీఎం రేవంత్ వ్యాఖ్యలకు స్పందించిన బండి సంజయ్.. గద్దర్‌కు ఇవ్వబోం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు తగులబెట్టారు.

Next Story

Most Viewed