- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Mahesh Kumar: దావోస్ పెట్టుబడులపై చర్చకు సిద్ధమా? బీఆర్ఎస్‌కు మహేశ్ కుమార్ గౌడ్ సవాల్

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పెట్టుబడులు రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని దావోస్ వేదికగా మరోసారి రుజువైందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) హర్షం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో వచ్చిన పెట్టుబడులు.. ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులపై చర్చకు (BRS party) బీఆర్‌ఎస్ సిద్దమా? అని సవాల్ చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకున్నా " తెలంగాణ రైజింగ్ 2025 విజన్" రాష్ట్రానికి గేమ్ చేంజర్‌గా మారిందన్నారు. (Davos) దావోస్‌లో తెలంగాణ పెవిలియన్ వద్ద పెట్టుబడులు పెట్టడానికి ప్రముఖ కంపెనీలు పెద్ద ఎత్తున క్యూ కట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత రికార్డు స్థాయిలో లక్ష 78 వేల 950 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రూ.25,750 కోట్ల పెట్టుబడులు రాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో రూ.2 లక్షలకుపైగా పెట్టుబడులు తీసుకొచ్చిందన్నారు.
ఏడాది కాంగ్రెస్ పాలనలో పెట్టుబడులు నాలుగు రెట్లు పెరిగాయన్నారు. దావోస్‌లో 16 సంస్థల పెట్టుబడుల ఒప్పందంతో యువతకు 50 వేలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం ముందు చూపుతూ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, నగరంలో మెట్రో విస్తరణకు అధిక ప్రాధాన్యతనివ్వడం కూడా తెలంగాణలో పెట్టుబడులకు కంపెనీలు ఆసక్తి చూపాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతోపాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ప్రపంచ పారిశ్రామిక వేత్తల దృష్టిని ఆకర్షించిందన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కీలకంగా ఉందన్నారు. భారీగా పెట్టుబడులు రావడంతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్‌కు కూడా ‘భూం’ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.