Mahesh Kumar Goud: బండి సంజయ్ దిగజారి మాట్లాడకు.. టీపీసీసీ చీఫ్ స్ట్రాంగ్ కౌంటర్

by Shiva |
Mahesh Kumar Goud: బండి సంజయ్ దిగజారి మాట్లాడకు.. టీపీసీసీ చీఫ్ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ (BJP) భారత జట్టు అని.. రాష్ట్రంలో ఎంఐఎం (AIMIM)తో దోస్తీ చేస్తున్న కాంగ్రెస్ (Congress) పార్టీది పాకిస్థాన్ (Pakistan) క్రికెట్ టీమ్ అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. ఈ క్రమంలోనే బండి సంజయ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల వచ్చాయనే ఓట్ల కోసం బండి మరోసారి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అయినా, రాష్ట్ర రాజకీయాలను క్రికెట్ (Cricket)తో ముడిపెట్టడం కేవలం బీజేపీ నాయకులకే చెల్లిందని ఫైర్ అయ్యారు. ఇండియా (India) గెలిస్తే బీజేపీ (BJP) గెలిచినట్లే అన్నట్లుగా బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) సమీపించిన వేళ కేంద్ర ప్రభుత్వం (Central Government)లో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఎప్పటిలాగే కేవలం ఎన్నికల సమయంలోనే కమలనాథులకు హిందుత్వ నినాదం గుర్తుకు వస్తుందని సెటైర్లు వేశారు. పన్నుల విషయంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) నుంచి తెలంగాణ రాష్ట్రానికి (Telangana State)కు రావాల్సిన వాటి గురించి బీజేపీ (BJP) నుంచి గెలచిన 8 మంది ఎంపీలో ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్‌ (Bandi Sanjay)లు ఏనాడైనా కష్టపడిన దాఖలాలు ఉన్నాయా అని మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

Next Story