TS: ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

by GSrikanth |   ( Updated:2024-02-26 17:10:59.0  )
TS: ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మార్చి 28న జరగనున్నది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూలు విడుదల చేసింది. ఉప ఎన్నిక నిర్వహణ కోసం మార్చి 4న నోటిఫికేషన్ వెలువడనున్నది. అదే రోజున నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. నామినేషన్లను దాఖలు చేయడానికి మార్చి 11 డెడ్‌లైన్ అని, మరుసటి రోజున స్క్రూటినీ ఉంటుందని, ఉపసంహరించుకోడానికి మార్చి 14 తుది గడువు అని పేర్కొన్నది. పోలింగ్ మార్చి 28న జరగనున్నదని, ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 2న ఉంటుందని ఆ షెడ్యూలులో ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఇప్పటివరకూ ఆ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి పోటీ చేసి గెలవడంతో రాజీనామా చేశారు. ఆ కారణంగా ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైంది.

నోటిఫికేషన్ రిలీజ్ : మార్చి 4న

నామినేషన్లు ప్రారంభం : మార్చి 4 నుంచి

నామినేషన్లకు డెడ్‌లైన్ : మార్చి 11

నామినేషన్ల స్క్రూటినీ : మార్చి 12న

ఉపహంసరణకు గడువు : మార్చి 14న

పోలింగ్ జరిగేది : మార్చి 28న

ఓట్ల లెక్కింపు : ఏప్రిల్ 2న

Advertisement

Next Story

Most Viewed