- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో ‘మహాలక్ష్మి పథకం’ ప్రశ్నలు..
by Ramesh N |

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ముగిసింది. ఇవాళ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. సెంటర్ల వద్ద భారీ బందోబస్తు నడుమ ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్ ముగిసిన అనంతరం గ్రూప్-1 కశ్చన్ పేపర్‌పై చర్చ జరుగుతోంది. కశ్చన్ పేపర్‌లో గ్రూప్-1 పరీక్షలో గృహ జ్యోతి, 500 సిలిండర్ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు.
మహాలక్ష్మీ పథకం క్రింద గృహ అవసరాల నిమిత్తం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరలకు సరఫరా చేయడం క్రింది వాటిలో దేనికి సంబంధించినది..? అంటూ నాలుగు ఆప్షన్లతో ఒక ప్రశ్న ఇచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ గృహ జ్యోతి పథకానికి సంబంధించిన వాటిని గుర్తించండి..? అని నాలుగు ఆప్షన్లతో ఒక ప్రశ్న ఇచ్చారు. ఈ రెండు ప్రశ్నలు గ్రూప్-1లో రావడం హాట్ టాపిక్‌గా మారింది.
Next Story